Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బిహార్‌లోని కైమూర్‌లో ఓ అమానవీయ ఘటన జరిగింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒక వృద్ధ టీచర్ని విచక్షణారహితంగా కొట్టారు. వృద్ధ టీచర్ నావల్ కిషోర్ పాండే డీపీఎస్ పాఠశాలలో ఇంగ్లిషు బోధిస్తున్నాడు. జయప్రకాష్ చౌక్‌లోని పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీన్ని పట్టించుకోకుండా కిషోర్ రోడ్డు దాటుతున్నాడు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆయనను ఆపే ప్రయత్నం చేశారు. అతడు వీరిని పట్టించుకోలేదు. ఆగ్రహానికి గురైన కానిస్టేబుళ్లు వృద్ధుడిని రోడ్డు మీద ఆపి కొట్టడం ప్రారంభించారు. దీనిని గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పోలీసు అధికారులు కానిస్టేబుళ్లను 3 నెలల పాటు విధుల నుంచి తప్పించారు.