Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కల్తీ మద్యం తాగి ఇద్దరు మరణించిన ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలోని సివాన్ పట్టణంలో మద్యం తాగి ఇద్దరు మరణించగా, డజన్ల కొద్దీ మంది అస్వస్థతకు గురయ్యారు. సివాన్ పట్టణంలోని లకారీ నబీగంజ్ ప్రాంతంలో కల్తీ మద్యం తాగి ఇద్దరు మరణించగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సివాన్‌లోని సబ్-డివిజనల్ పబ్లిక్ గ్రీవెన్స్ ఆఫీసర్ అభిషేక్ చందన్ చెప్పారు. సివాన్‌లోని నబీగంజ్‌లోని బాలా గ్రామానికి చెందిన జనక్ బీన్ అలియాస్ జనక్ ప్రసాద్, నరేష్ బీన్ లు కల్తీ మద్యం తాగి మరణించారు.కల్తీ మద్యం తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 2016వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించారు. గతంలో కల్తీ మద్యం తాగడం వల్ల 70 మంది మరణించారు.