Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : అమెరికాలోని మాంటెరీ పార్క్ కాల్పుల నిందితుడు హతయ్యాడు. చైనీయుల లూనార్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటెరీ పార్క్లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. శనివారం రాత్రి 10.22 గంటలకు జరిగిన ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం దుండగుడు అక్కడి నుంచి పారరాయ్యాడు. అయితే వైట్ కలర్ వ్యాన్లో వచ్చిన వ్యక్తే దీనికి కారణమని నిర్ధారించిన పోలీసులు.. ఆ వాహనాన్ని వెంబడించారు. ఈ క్రమంలో వ్యాన్ను పోలీసులు చుట్టుముట్టడంతో అతడు కాల్చుకుని చనిపోయాడని పోలీస్ అధికారి రాబర్ట్ లూనా తెలిపారు. నిందితుడిని 72 ఏండ్ల హు కన్ ట్రాన్గా గుర్తించామని చెప్పారు. మాంటెరీ పార్క్లో ఎక్కువగా ఏసియన్లే ఉంటారు. అందులోనూ చైనీయులే అధికం. తన రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు తలుపులు మూసేయమని కోరారని, బయట ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్నట్టు చెప్పారని రెస్టారెంట్ యజమాని సూంగ్ వాన్ చోయ్ వెల్లడించారు.