Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ తారల క్రికెట్‌కు రంగం సిద్ధమవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ జట్ల మధ్య ప్రతి ఏడాది జరిగే 'క్రెసెంట్ క్రికెట్ కప్' (సీసీసీ) పోటీలు వచ్చే నెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు ప్రకటించారు. ఈసారి 'సే టు నో డ్రగ్స్' అంశంపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. బంజారాహిల్స్‌లోని హోటల్ హ్యాత్ప్లేస్లో నిన్న తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విడివిడిగా ఎమ్మెల్యే బాలరాజుతో కలిసి క్రికెట్ కప్, పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలీవుడ్ జట్టు కెప్టెన్ అర్బాజ్ ఖాన్, బిగ్‌బాస్ 6 విజేత రేవంత్, టాలీవుడ్ నటులు రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, తనీశ్, ఖయ్యూం, రవి ప్రకాశ్, శ్రావణ్, వీజే సన్నీ, అమిత్ తదితరులు పాల్గొన్నారు.