Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బులియన్ మార్కెట్లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తులం బంగారం ధర దాదాపు రూ.58 వేలకు చేరుకుంది. ఇక రూ.60 వేలకు చేరుకునేందుకు పెద్దగా టైం కూడా పట్టేలా కనిపించేలా లేదు. ఇవాళ మాత్రం బంగారం, వెండి ధరలు కాస్త శాంతించాయి. తాజాగా మార్కెట్లో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) బంగారం ధర రూ.52,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,060 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.72,300 లుగా కొనసాగుతోంది.