Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ హీరో గుర్తింపు కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'బీరువా', 'ఏ1 ఎక్స్‌ప్రెస్' వంటి పలు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలే సాధించినా.. సందీప్‌కు మాత్రం స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టలేకపోయాయి. ఈ క్రమంలో రెండేళ్లు గ్యాప్ తీసుకుని 'మైఖేల్' వంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రంజిత్ జయంకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమ ట్రైలర్ రిలీజైంది.