Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్లో ప్రధాన ప్రజా రవాణా సాధనల్లో ఒకటై మెట్రో రైలు సేవలకు తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్యలతో రైళ్లు గమ్యస్థానాలకు చేరకముందే నిలిచిపోతున్నాయి. ఈకారణంగా ఇతర రైళ్ల సర్వీసులూ ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్లోని ఎర్రమంజిల్లో మెట్రో రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులను సిబ్బంది మరో రైలులో తరలించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తుండగా రైలులో టెక్నికల్ సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.