Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల శ్రమతో జేమ్స్ కామెరాన్ ఆవిష్కరించిన చిత్రం అవతార్ 2 (ద వే ఆఫ్ వాటర్). ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీయగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలై అభిమానుల మెప్పును పొందడమే కాకుండా, భారీగా వసూళ్లు చేసుకుంటోంది. కనీసం 2 బిలియన్ డాలర్లు వసూలు చేస్తేనే లాభ, నష్టాల్లేని స్థితికి చేరుకుంటామని.. జేమ్స్ కామెరాన్ ఇటీవలే అవతార్-2 బిలియన్ డాలర్ల ఆదాయ మార్క్ ను చేరుకున్న సందర్భంగా ప్రకటించారు. కామెరాన్ ఆకాంక్షించినట్టుగానే అవతార్ 2 సినిమా వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ డాలర్లను అధిగమించాయి. ఇక ఇక్కడి నుంచి వసూలయ్యే మొత్తం నిర్మాతలకు లాభాలుగా మిగిలిపోనున్నాయి. 2 బిలియన్ డాలర్లను వసూలు చేసిన సినిమాల్లో అవతార్ 2 ఆరోది. కనీసం రెండు బిలియన్ డాలర్లు వసూలైతేనే తాను తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తానని కామెరాన్ ప్రకటించడం గమనార్హం. అది నెరవేరింది కనుక కామెరాన్ నుంచి మనం భవిష్యత్తులో మరో అపురూప చిత్రం చూసే అవకాశం ఉంటుంది. బాక్సాఫీసు వద్ద 2 బిలియన్ డాలర్లు వసూలు చేసిన ఆరు సినిమాల్లో మూడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించినవే. అవతార్ (2009), అవెంజర్స్ ఎండ్ గేమ్ (2019), టైటాన్ (19997), స్టార్ వార్స్ ద ఫోర్స్ అవేకెన్స్ (2015), అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ (2018), అవతార్ 2 (2022) ఇవన్నీ వసూళ్లలో రికార్డులు నమోదు చేసినవి. వీటిల్లో టైటాన్, అవతార్, అవతార్ 2 కామెరాన్ తీసినవి.