Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిపై వేటు పడింది. ఆనందన్ను సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడ్రోజుల క్రితం స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబడ్డారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆనంద కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నాడు. సస్పెన్షన్ ఆదేశాలు నిందితుడికి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
అసలేం జరిగిందంటే.. సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ ఇంట్లోకి మూడ్రోజుల క్రితం ఒక వ్యక్తి అర్ధరాత్రి చొరబడ్డాడు. ఈ విషయాన్ని స్మితా సబర్వాల్ స్వయంగా ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి తన ఇంట్లోకి ఓ చొరబాటు దారుడు రావటం.. అత్యంత బాధాకరమని స్మితా సబర్వాల్ నిన్న ట్వీట్ చేశారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి అతని నుంచి తనను తాను కాపాడుకున్నానని తెలిపారు. మనం ఎంత సురక్షితంగా ఉన్నామని భావించిన తలుపు, తాళాలు సరిగా వేసి ఉన్నాయో లేదో అన్న విషయాన్ని స్వయంగా తనిఖీ చేయాలన్న గుణపాఠం నేర్చుకున్నట్టు వివరించారు.