Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ సీబీఐ అధికారులు కడప జిల్లా పులివెందుల వచ్చారు. ఇక్కడి వైసీపీ కార్యాలయానికి వెళ్లిన సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. ఆయన కార్యాలయానికి రాలేదని సిబ్బంది చెప్పడంతో సీబీఐ అధికారులు వెనుదిరిగారు. భాస్కర్ రెడ్డి... వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి. గతంలో, వివేకా కుమార్తె సునీతారెడ్డి పేర్కొన్న 15 మంది అనుమానితుల్లో భాస్కర్ రెడ్డి పేరు కూడా ఉందని పలు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, భాస్కర్ రెడ్డి ఇప్పటికే ఓసారి సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. తాజాగా, ఆయన కోసం సీబీఐ అధికారులు మరోసారి ఆరా తీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ బృందం నేడు పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను కూడా పరిశీలించింది.