Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేరళ
కేరళలోని కొచ్చిలో నోరోవైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఓ స్కూల్లో పిల్లలకు ఆ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. నోరోవైరస్ సోకిన విద్యార్థుల్లో వాంతులు, విరోచనాలు వస్తున్నాయి. కక్కనాడ్‌లోని ప్రైవేటు స్కూల్ విద్యార్థుల్లో ఈ లక్షణాలు కనిపించాయి. కొందరు చిన్నారులు పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. దీంతో ఒకటో తేదీ నుంచి అయిదో తరగతి విద్యార్ధులకు సెలవులు ఇచ్చారు. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు మొదలుపెట్టింది. నోరోవైరస్ ఓ అంటువ్యాధి. దాని వల్ల వాంతులు వస్తాయి. డయోరియా లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరికి స్వల్పంగా జ్వరం, వణుకుడు, తలనొప్పి వస్తుంది.