Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బిగ్‌బాష్ లీగ్13వ సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. హోబర్ట్ హరికేన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. టీ20ల్లో అతనికిదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఈ మ్యాచులో స్మిత్ 66 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. సిడ్నీ స్టార్స్ తరఫున ఆడుతున్న స్మిత్ ఈ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రయికర్స్పై వరుసగా శతకాలు బాదాడు. అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 180.21 స్ట్రయిక్ రేటుతో 328 రన్స్ చేశాడు. దాంతో, ఈ సీజన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. స్మిత్ ఖాతాలో24 సిక్స్‌లు ఉన్నాయి.
గత ఏడాది బీబీఎల్ సీజన్లో స్మిత్ 18 సిక్సర్లు కొట్టాడు. టిమ్ డేవిడ్ (18), మాథ్యూ షార్ట్ (18) సిక్స్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులోనూ స్మిత్ శతకాల మోత మోగించాడు. అతను సూపర్ ఫామ్‌లో ఉండడంతో ఆసీస్ యాజమాన్యం సంతోషంతో ఉంది. ఎందుకంటే.. ఫిబ్రవరిలో ఆ జట్టు భారత పర్యటనకు రానుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4 టెస్టుల మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.