Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అమెరికాలో దారుణం జరిగింది. చికాగో నగరంలో చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి సాయిచరణ్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో సాయిచరణ్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు తరలించారు. ఘటన గురించి సాయిచరణ్ స్నేహితులు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సాయిచరణ్ గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు.