Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటి, నటుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అపూర్ అశ్విన్, నటాషా కపూర్‌ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైల్డ్ మోడలింగ్‌లో అవకాశాలు కల్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ర్యాంప్ షోలలో అవకాశాల పేరుతో చీటింగ్ కు పాల్పడుతున్నారు. నటి రష్మికతో మోడలింగ్ చేసే అవకాశమంటూ మాయమాటలు చెప్పి మోసలకు పాల్పడుతున్నారు. వ్యాపారవేత్తల పిల్లలే టార్గెట్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారవేత్త నుంచి నిందితులు రూ.20 లక్షల వరకు వసూళ్లు చేశారు. కాస్మోపాలిటన్ మోడల్ పేరుతో నిందితులు వెబ్సైట్ నిర్వహిస్తున్నారు.