Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. కనుమదారిలోని 9వ మలుపు వద్ద కొబ్బరి చిప్పలు తీసుకువస్తున్న ఓ మినీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘాట్‌రోడ్డు భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల నుంచి సరకు రవాణా వ్యాన్‌లో డ్రైవర్ యువరాజు, మరో వ్యక్తి చంద్రతో కలిసి తిరుపతికి బయలుదేరారు. మొదటి ఘాట్‌రోడ్డు 9వ మలుపురాగానే వ్యాన్ వేగంగా రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఇతర వాహనాల్లోని భక్తులు క్షతగాత్రులను గుర్తించి అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.