Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ అందుబాటులోకి తేనున్నట్లు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రస్తుతం 750పోలీస్ స్టేషన్లలో హెల్ప్‌డెస్క్ సేవలు అందుతున్నాయని దశలవారీగా అన్ని పోలీస్స్టేషన్లకు విస్తరిస్తామన్నారు. మహిళా భద్రత విభాగం పనితీరుపై ఆ విభాగం చీఫ్ శిఖాగోయల్, డీఐజీ సుమతితో డీజీపీ తన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రతలో రాష్ట్రాన్ని అత్యంత సురక్షితంగా మార్చడంలో మహిళా భద్రత విభాగం కృషిని డీజీపీ అభినందించారు. అయితే మహిళలు, చిన్నారులపై నేరాలను పూర్తిస్థాయిలో కట్టడిచేసేలా పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని, మిగతా జిల్లాల్లోనూ అందుబాటులోకి తెస్తామని డీజీపీ తెలిపారు. నేరాల నివారణకు సమర్ధవంతంగా పనిచేసే అధికారుల్ని గుర్తించి రివార్డులు అందించి ప్రోత్సహించాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు.