Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులతో దద్దరలిస్తున్నది. అయోవాలోని డెస్ మోయిన్స్లోని పాఠశాలలో కాల్పులు జరగ్గా.. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డెస్ మోయిన్స్ అయోవా చార్టర్ స్కూల్లో సోమవారం కాల్పులు జరిగాయి. కాల్పుల్లో గాయపడిన విద్యార్థులను ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
కాల్పుల్లో మొత్తం ముగ్గురికి గాయాలయ్యాయి. ఉపాధ్యాయుడికి బుల్లెట్ గాయాలు కాగా.. చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో దుండగులు కాల్పులు జరుపగా.. పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.