Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
అమెరికా ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ మోటార్స్ కో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో యూరప్ దేశాల్లోని ఫోర్డ్ మోటార్స్ కంపెనీలో 3,200మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింద ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మళ్లిన ఫోర్డ్ మోటార్స్ ఖర్చులను తగ్గించేందుకు తాజాగా లేఆఫ్ ప్రకటించింది. జర్మనీలోని కొలోన్ లోని కార్ల తయారీ ఫ్యాక్టరీలో వర్క్స్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగాల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. జర్మనీ కేంద్రంగా సాగుతున్న కార్ల ఉత్పత్తి కంపెనీలో ఉద్యోగాల కోతలు ప్రభావం చూపించనున్నాయి.అమెరికాలో ఫోర్డ్ కంపెనీలో గత సంవత్సరం 3వేల మంది ఉద్యోగులను తొలగించింది.దశాబ్దం చివరినాటికి యూరప్ దేశాల్లో పూర్తిగా కార్ల తయారీ మొత్తం ఎలక్ట్రిక్‌గా మార్చాలని కంపెనీ యోచిస్తోంది.