Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
ముంబై: ముంబై ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజెర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 90వేల అమెరికా డాలర్లను సీజ్ చేశారు. అమెరికా డాలర్ల నోట్లను పుస్తకాల్లో తీసుకువస్తున్న ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. జనవరి 22, 23వ తేదీల్లో ఈ ఘటనలు జరిగాయి. ఆ ప్రయాణికులు ఇద్దరూ విదేశీయులే. పుస్తకాల్లో డాలర్ల నోట్లను పట్టుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా ఆ ప్రయాణికుల నుంచి 2.5 కేజల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. పేస్ట్ రూపంలో వాళ్లు ఆ బంగారాన్ని తీసుకువచ్చారు.