Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. కరాచీ నగరంలోని పిరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంటి నుంచి పారిపోయి ప్రేమ పెండ్లి చేసుకుంది. పెండ్లి చేసుకున్న మహిళ వివాహ ధ్రువీకరణ పత్రం కోసం కరాచీ కోర్టుకు వచ్చింది. కోర్టులో తండ్రి పరువు కోసం నవ వధువైన కన్న కూతుర్ని కాల్చి చంపిన ఘటన పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది. తండ్రి జరిపిన కాల్పుల్లో కూతురు మరణించిందని కరాచీ ఎస్పీ షబ్బీర్ సేథర్ చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి, ఆయన వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. పాకిస్థాన్ దేశంలో పరువు హత్యలకు బ్రేక్ పడటం లేదు. గత దశాబ్ద కాలంలో ఏటా సగటున 650 పరువుహత్యలు జరిగాయని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. పరువు పేరిట పాక్ దేశంలో ఏటా వందలాది మంది మహిళలు హత్యకు గురవుతున్నారు.