Authorization
Fri May 16, 2025 04:00:06 pm
నవతెలంగాణ - జనగామ
జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. మూడు రోజుల క్రితం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలను బూతులు తిట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.