Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్‌వేగాస్‌లోని ది మిరాగ్లో శనివారం జరిగిన ఆటా బోర్డు మీటింగ్‌లో ప్రస్తుత అధ్యక్షుడు భువనేశ్ భూజల నూతన అధ్యక్షురాలికి బాధ్యతలు అప్పగించారు. సమావేశానికి యూఎస్‌లోని ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.
నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నుంచి ‘ఆటా’లో చురుగ్గా ఉండడంతో పాటు సెక్రెటరీ, జా యింట్ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితర పదవుల్లోనూ సేవలందించారు. ఈ నెలలో ఆటాలోని 16 బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు నాలుగేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు.