Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోషిని అదృశ్యం అయ్యింది. సంక్రాంతి సెలవులు కావడంతో ఈ నెల 13 తేదీన సంక్రాంతి సెలవుల కోసం బాబాయి ఇంటికి వెళ్తున్నానంటూ యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయింది. అదేరోజు బాబాయి ఇంటికి చేరుకున్న ఆమె ఇక, 16వ తేదీన బాబాయి ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నాను అని చెప్పి బయల్దేరింది. ఈ తరుణంలో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆమె ఎక్కడ ఉన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ నెల 22వ తేదీన టాంజానియాలో ఉన్న తన తండ్రికి రాముకు ఫోన్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో, ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు యూనివర్సిటీకి ఫోన్ చేయగా 22వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయని తెలిపారు. మళ్లీ రోషినికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థిని అదృశ్యంపై దర్యాప్తు ప్రారంభించారు. అనేక కోణంలో విచారణ జరుపుతున్నారు.