Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జొమాటలో 10 నిమిషాలకే డెలివరీ సర్వీసును నిలిపివేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ఏరియాల్లో గతేడాది మార్చిలో ప్రయోగాత్మకంగా ఈ సర్వీసును ప్రారంభించింది. కానీ పలు కారణాలతో నిలిపేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే ఉద్యోగాల భర్తీ కోసం జొమాటో ప్రకటన విడుదల చేసింది.
దేశంలోని 5 లొకేషన్లలో 800 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. విషయాన్ని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తెలియజేశారు. ఇంజినీర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, గ్రోత్ మేనేజర్స్ ను నియమించుకోవాలని చూస్తున్నామని తెలిపారు. అలాగే సీఈవోకు చీఫ్ ఆఫ్ స్టాఫ్, జెనరలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజినీర్ ను హైర్ చేసుకోనున్నట్లు లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. దీనిపై మరిన్నివివరాలకు [email protected] మెయిల్ ని సంప్రదించవచ్చాన్నారు.