Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగుళూరు
బెంగుళూరులో కేఆర్ మార్కెట్ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై నుంచి ఓ వ్యక్తి కింద కరెన్సీ నోట్లను విసిరేశాడు. దీంతో అక్కడ కొంచం సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ వ్యక్తి నోట్లు విసిరేస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు. కొందరు అతని వద్దకు వెళ్లి డబ్బు తమకు ఇవ్వాలంటూ వేడుకున్నారు.
ఈ ఘటన జరిగింది. ఫ్లైఓవర్ కింద ఆ కరెన్సీ నోట్లను అందుకునేందుకు భారీ సంఖ్యలో జనం గుమ్మికూడారు. రూ.10 నోట్లను అతను విసిరేసినట్లు తెలుస్తోంది. సుమారు మూడువేల విలువైన నోట్లను అతను పారేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చే లోపు అతను అక్కడ నుంచి పారిపోయాడు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.