Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు చిత్తూరు జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పాదయాత్రకు అనుమతిని ఇచ్చామని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఆటంకాలు కలిగించకూడదని తెలిపారు.
ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని తెలిపారు. టపాసులను పేల్చడం నిషిద్ధమని, సమయాలకు కట్టుబడి బహిరంగసభలను నిర్వహించుకోవాలని అన్నారు. సమావేశ స్థలాల్లో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్సులను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి అగ్నిమాపక యంత్రాన్ని కూడా ఉంచాలని తెలిపారు.