Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ - హైదరాబాద్
జనవరి 25న పఠాన్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో రిలీజ్ కు ముందే రికార్డులూ సృష్టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ మూవీగా పఠాన్ మారింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 100కు పైగా దేశాల్లో 2,500కు పైగా స్కీన్లలో రిలీజ్ అవుతోంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్ తోపాటు దీపికా పడుకోన్, జాన్ అబ్రహం వంటి స్టార్లు నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కు పైగా దేశాల్లో మూవీ రిలీజ్ అవుతోందని, ఇది ఇండియా సినిమా చరిత్రలోనే తొలిసారి అని ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా తెలిపారు. షారుఖ్ ఖాన్ అంతర్జాతీయంగా అతిపెద్ద సూపర్‌స్టార్‌గా నిలిచారు. సినిమాపై వచ్చిన హైప్ వల్ల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి డిమాండ్ ఏర్పడింది’’ అని తెలిపారు. ‘‘యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఇది నాలుగో సినిమా. ఓవర్ సీస్ లో పఠాన్ భారీ వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నాం. ఈ సంవత్సరంలో థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌కు ఈ మూవీ తిరిగి ఉత్సాహాన్ని తీసుకొస్తుంది’’ అని ఆయన ఆశాబావాన్ని వ్యక్తం చేశారు.