Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇప్పటికే 3512 కిలో మీటర్ల వరకు షర్మిల పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఈనెల 28 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. గతంలో ఎక్కడైతే పాదయాత్రకు బ్రేక్ పడిందో అక్కడి నుంచే యాత్ర సాగనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే 4000 వేల కిలో మీటర్ల మైలు రాయి వరకు షర్మిల పాదయాత్ర సాగనుంది. వరంగల్లో భారీగా పాదయాత్ర ముగింపు సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 28 నుంచి మొదలయ్యే పాదయాత్ర కోసం వైఎస్సార్టీపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు.