Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాగోల్ బండ్లగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వంశీకృష్ణ హనీమూన్ యాత్ర విషాదాంతమైంది. ఇండోనేషియా బాలి సమీపంలోని ఐలాండ్‌లో రైడింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. నాగోలు డివిజన్ అజయ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాముని రవీందర్, విజయలక్ష్మి దంపతులకు రెండో కుమారుడైన వంశీకృష్ణ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇతనికి గత ఏడాది జూన్‌లో శ్రావణితో వివాహమైంది. సివిల్స్ రాసిన వంశీకృష్ణ ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి అర్హత సాధించి, మెయిన్స్ రాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 13న భార్యతో కలిసి హనీమూన్‌కు మొదట మలేషియా వెళ్లాడు. అక్కడి నుంచి ఈనెల 19న ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. 21న బాలికి కొంత దూరంలోని పెన్నిడా ఐలాండ్ వెళ్లారు. అక్కడ బస చేశారు. 22న ఉదయం పెన్నిడా ఐలాండ్‌లో సముద్ర భూభాగంలో అక్వేరియం చేపలు చూసేందుకు 20మంది పర్యాటకులు, ముగ్గురు గైడ్లు ఒకేసారి దిగారు. అందులో వంశీకృష్ణ కూడా ఉన్నారు. ఆక్సిజన్ మాస్క్, డ్రైవింగ్ షూతో వంశీకృష్ణ దిగాడు. ఈ క్రమంలో అతను సముద్రంలోనే గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. అదేరోజు సాయంత్రం అతని మృతదేహాన్ని గుర్తించారు.