Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 144 పాయింట్లు తగ్గి 60,834 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. నిఫ్టీ 25 పాయింట్లు పడిపోయి 19,093 పాయింట్ల వద్ద, బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 42,703 వద్ద ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 404 పాయింట్లకుపైగా కోల్పోయి 60,574 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్ల పతనమై 17,969 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 556 పాయింట్లు తగ్గి 42,177 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్లో మారుతీ సుజుకీ షేర్లు మంచి వృద్ధిని కనబరుస్తున్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఆటో, హెచ్యూఎల్ లాభాల్లో కొనసాగుతుండగా.. అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.