Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై బండరాళ్లు బోల్తా పడి ట్రక్కు, ట్యాంకర్ను ఢీకొన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై బండరాళ్లు పడిపోవడంతో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బండరాళ్లు పడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. బండరాళ్లు మీదపడి ట్రక్కు డ్రైవర్ మునీబ్ తక్ మరణించాడు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.