Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : 'ఎఫ్ 3' సినిమాతో మరో హిట్ ను అందుకున్నా హీరో వెంకటేశ్ 'ఓరి దేవుడా' సినిమాలో ప్రత్యేకమైన పాత్రలోను అలరించారు. ఆ తరువాత ఆయన చేయనున్నది తన కెరియర్లో 75వ సినిమా. ఏ డైరెక్టర్ తో ఆయన ఈ సినిమా చేయనున్నాడా అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే 'హిట్ 2'తో హిట్ కొట్టిన శైలేశ్ కొలను దర్శకత్వంలో ఆయన ఈ సినిమా చేయనున్నాడనే విషయం అధికారికంగా బయటికి వచ్చింది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 'సైంధవ్' అనే టైటిల్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. వెంకీ రఫ్ లుక్ .. ఆయన గన్ పట్టుకున్న తీరు చూస్తుంటేనే, ఇది భారీ యాక్షన్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.