Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్‌ను కౌన్సిల్ విత్‌డ్రా చేసుకుందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని.. ప్రభుత్వ తరుపు న్యాయవాది వెల్లడించారు. కౌన్సిల్ ఇచ్చిన రిజల్యూషన్‌ను పరిగణలోకి తీసుకోవాలా వద్ద అనేది ప్రభుత్వం అలోచిస్తోందన్నారు. టౌన్ ప్లానింగ్ యాక్ట్ 14 ప్రకారం మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కౌన్సిల్ నిర్ణయంపై ప్రభుత్వ వైఖరి రెండు వారాల్లోపు చెప్పాలని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు కౌంటర్ అఫిడవిట్లో పొందపరచాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.