Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ రెండో సారి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని తాజా నోటీసులలో వివేకా హత్య కేసుకు సంబంధించి గత రెండున్నరేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అవినాశ్ ను ఇంతవరకు సీబీఐ విచారించలేదు. తొలిసారి ఆయనను విచారణకు రావాల్సిందిగా మూడు రోజుల క్రితం సీబీఐ ఆదేశాలు జారీ చేసింది.
అయితే నోటీసులు ఇచ్చిన వెంటనే విచారణకు రావాలంటే ఎలా అని అవినాశ్ నిన్న మీడియాతో మాట్లాడారు. తనకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని విచారణకు హాజరు కావడానికి ఐదు రోజుల సమయం కావాలని సీబీఐకి లేఖ రాశారు. ఈ తరుణంలోనే అవినాశ్ కు సీబీఐ రెండో సారి నోటీసులను జారీ చేసింది. 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది.