Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎంఆర్ఎఫ్ ఐసీసీ మెన్స్ వన్ డే ర్యాంకింగ్స్ కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. దీనిలో మన హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మెరిశారు. చాలా రోజుల తర్వాత ఐసీసీ మెన్స్ ర్యాంకింగ్స్‌లో చోటు పొంది భారత్‌కా షాన్ అనిపించుకున్నాడు. అయితే ఈ జాబితాలో మన మరో బౌలర్ మహమ్మద్ షమీ తన ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు.ఆ క్రమంలో వన్డేల్లో భారత్ నంబర్ వన్ పొజిషన్‌కు చేరింది.
ఈ సిరీస్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సీమ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ చెరో 6 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. యాదవ్ 21వ స్థానం నుంచి 19వ స్థానానికి ఎగబాకగా, ఠాకూర్ 5 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌లో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు నంబర్ 1 స్థానాన్ని భారత బౌలర్లు కపిల్ దేవ్, మణిందర్ సింగ్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా అందుకున్నారు.