Authorization
Fri May 16, 2025 04:48:19 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ సరదాతో ప్రాణాలు తీసుకున్నాడు. తాళ్లూరుకు చెందిన మణకంఠ రెడ్డి అనే యువకుడు కందుకూరులో జ్యూస్ దుకాణం నిర్వహిస్తుంటాడు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలోకి మంగళవారం రాత్రి పాములు ఆడించే వ్యక్తి వచ్చాడు. అక్కడికి చేరుకున్న మణికంఠ పాములు ఆడించే వ్యక్తి చేతిలోని పామును తన మెడలో వేసుకొని సెల్ఫీ దిగాడు. పామును కిందికి దించుతున్న సమయంలో అది కాటు వేసింది. దీంతో స్థానికులు యువకుడిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే మణికంఠ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.