Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ - హైదరాబాద్
వచ్చే నెలలో రోబో లాయర్ ప్రపంచంలోనే తొలిసారి కోర్టులో కేసును వాదించబోతోంది. అమెరికాలోని కోర్టులో వాదనలను వినిపించబోతోంది. డునాట్ పే అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబో న్యాయవాదిని సృష్టించింది. ట్రాఫిక్ చలానాకు సంబంధించిన కేసును ఈ రోబో వాదించబోతోంది. అయితే, ఈ కేసు విచారణ ఏ కోర్టులో జరుగబోతోందో ఆ కంపెనీ తెలుపలేదు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపినందుకు విధించిన చలానా కేసులో ఈ రోబో న్యాయవాది తన వాదనలను వినిపించనుంది.