Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
మహిళల ఐపీఎల్ పేరుని మహిళల ప్రీమియర్ లీగ్ గా ఖరారు చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ లీగ్‌లో ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలం వివరాలను ఆయన తెలిపారు. ఈ వేలం ద్వారా బీసీసీఐకి ఐదు జట్ల ద్వారా రూ. 4670 కోట్ల భారీ మొత్తం సమకూరింది. 2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ కోసం జట్ల బిడ్డింగ్ ద్వారా పొందిన దాని కంటే ఈ మొత్తం ఎక్కువ అని జై షా పేర్కొన్నారు.
ఈ తరుణంలో ఐదు ప్రాంఛైజీలు ఈ వేలంలో పాల్గొని జట్లను సొంతం చేసుకున్నాయి. అహ్మదాబాద్ జట్టును అదానీ స్పోర్ట్స్‌లైన్ రూ.1,289 కోట్లకు, ముంబయి జట్టును ఇండియావిన్ స్పోర్ట్స్ రూ.913 కోట్లకు, బెంగళూరు జట్టును రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ.901 కోట్లకు, ఢీల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ రూ.810 కోట్లకు, లఖ్‌నవూ జట్టును కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.757 కోట్లకు దక్కించుకుంది.