Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మీడియా రంగంలో లింగ వివక్షను పోగొట్టేందుకు ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) నడుం బిగించింది. ఇందులో భాగంగా మీడియాలో జెండర్ సెన్సిటైజేషన్ అనే అంశంపై సదస్సు నిర్వహించనుంది. ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జరిగే ఈ సమ్మిట్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మీడియాలో నెలకొన్న లింగ వివక్షను రూపుమాపాల్సిన ఆవశ్యకతపై ఆ రంగంలో ప్రముఖ వక్తలు ప్రసంగాలు చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు యూనిసెఫ్ నాలెడ్జ్ భాగస్వామిగా ఉండనుందని ఐఏఏ ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, మీడియా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.ఐఏఏలో కార్పొరేట్ మెంబర్స్, ఆర్గనైజేషనల్ మెంబర్స్, విద్యా అనుబంధ సంస్థలతో పాటు 76 దేశాల నుంచి అనేక మంది సభ్యులతో కూడిన అసోసియేషన్. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.