Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్ద కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన వారుగా గుర్తించారు. తిరుమల దర్శనం తర్వాత కారులో కాణిపాకం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.