Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ప్రయివేటు లే అవుట్లలో 5శాతం భూమిని ప్రభుత్వానికి కేటాయించే విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు సవరణ జీవో నెంబరు 145ను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లోని లే అవుట్లలో 5శాతం పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 145 ను జారీ చేసింది.
ప్రయివేటు లే అవుట్లలో 5 శాతం భూమి కేటాయింపుపై రియల్ ఎస్టేట్ వర్గాలు, వ్యక్తుల నుంచి వచ్చిన వినతుల్ని పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను నిలుపుదల చేసింది. ఈమేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.