Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో ఒకేసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. ఎస్పీలు, కమిషనర్లు సహా 60 మంది ఐపీఎస్‌లు బదిలీ కానున్నారు. ఇక బదిలీ అయిన వారిలో నల్లగొండ, సిరిసిల్ల, పాలమూరు, వనపర్తి, మహబూబ్ నగర్ ఎస్పీలు ఉన్నారు. ఇక, కరీంనగర్, రామగుండం సీపీలు బదిలీ అయ్యారు.
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో మెజార్టీగా డీసీపీలు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా సుబ్బారాయుడు, మల్కాజ్గిరి డీసీపీగా జానకి ధరావత్, ఖమ్మం సీపీగా సురేష్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్, హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా రాజీవ్ రతన్‌లు బదిలీ అయ్యారు. ఒకేచోట ఎక్కువ రోజులు పోస్టింగ్‌లో ఉన్నవారిందరూ ఈ బదిలీల్లో ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు(బుధవారం) తీవ్రంగా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.