Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
2022లో పొట్టి ఫార్మాట్లో సూర్య అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. 31 మ్యాచ్‌ల్లో 45.56 సగటుతో 1164 పరుగులు చేసి ఈ ఫార్మాట్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వినూత్నమైన షాట్లు ఆడుతూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కి ఐసీసీ తగిన గుర్తింపునిచ్చింది. 2022 సంవత్సరానికిగాను టీ20ల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యని ప్రకటించింది. సూర్యకుమార్‌కు ఈ అవార్డు దక్కినందుకు బీసీసీఐ కూడా హర్షం వ్యక్తం చేసి అతడికి అభినందలు తెలిపింది.
మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపికైంది. ప్రస్తుతం ఈమె టీ20ల్లో నంబర్‌వన్ బ్యాటర్‌గా ఉంది. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022గా టీమ్ఇండియా బౌలర్ రేణుక సింగ్‌ని ఐసీసీ ఎంపిక చేసింది.