Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తన కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అదరగొడుతోంది. రోహన్ బోపన్నతో కలిసి మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్స్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో డిసిరే క్రావ్జిక్, నీల్ స్కుప్స్కి జోడీపై 7-6 (5), 6-7 (5), 10-6 తేడాతో సానియా జోడీ విజయం సాధించింది.
మ్యాచ్ విజయానంతరం సానియా మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన మ్యాచ్ అని తెలిపింది. రోహన్ తో కలిసి తన చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ పోరులో ఆడటం చాలా బాగుందని చెప్పింది. తనకు 14 ఏళ్లు ఉన్నప్పుడు తన మిక్స్ డ్ డబుల్స్ పార్ట్ నర్ రోహన్ అని ఇప్పుడు తనకు 36, ఆయనకు 42 ఏళ్ల వయసని, ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి ఆడుతున్నామని తెలిపింది.