Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఢీల్లి
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. గత సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,247(Q3) కోట్లుగా నమోదు చేసుకుందని తెలిపింది. 2021- 22లో ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.706.5 కోట్లతో పోలిస్తే 76.5 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది.
కంపెనీ మొత్తం ఆదాయం 27 శాతం వృద్ధి చెందినట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,319.7 కోట్లు రాగా ఈ ఏడాది రూ.6,770 కోట్లు వచ్చినట్టు, వడ్డీలు, పన్నులు, తరుగుదల, రుణ చెల్లింపులు జరపడానికి ముందు లాభాలు చూస్తే 14.3 శాతం పెరిగి రూ.1,407.56 కోట్లగా నమోదు చేసింది. గ్లోబల్ జెనరిక్స్ సెగ్మెంట్లో కంపెనీ ఆదాయం రూ.5924.1 కోట్లుగా నమోదు చేసింది. కొత్తగా మార్కెట్లో విడుదల చేసిన ఉత్పత్తుల వల్ల లాభాలు ఆర్జించామని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.