Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఢీల్లి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. గతేడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం తాజాగా జాబితాను విడుదల చేసింది.
2022 ఏడాదికి ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త దిలీప్ మహలనబిస్‌కు వైద్యరంగంలో మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఇదే తరుణంలో మరో 25 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వీరిలో తెలుగు రాష్ర్టలకు చెందిన ఇద్దరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలంగాణకు చెందిన బి.రామకృష్ణారెడ్డి, ఏపీలోకి కాకినాడకు చెందిన సుంకురాత్రి చంద్రశేఖర్‌కు పద్మశ్రీ అవార్డులు దక్కడం విశేషం.