Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే 2023 ను పురస్కరించుకొని పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 25 మందికి పద్మ అవార్డులను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ముగ్గురు తెలుగు రాష్ర్టాల నుంచి ముగ్గురు ఉన్నారు. తెలంగాణ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి పద్మ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి కాకినాడ వాసి చంద్రశేఖర్‌కు పద్మశ్రీ పురస్కారం అందనుంది. ముఖ్యంగా అందులో జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఇండియా పేరును నిలబెట్టిన సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఉండడం విశేషం.
సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటలను టాలీవుడ్ కు అందించారు కీరవాణి. ఆయన సేవలను మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీతో గౌరవించనుంది. కీరవాణి 1997లో అన్నమయ్య చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు. ఎనిమిది సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, మూడు సార్లు ఉత్తమ నేపథ్య గాయకుడిగానూ నంది అవార్డులు పొందారు. ఈ క్రమంలోనే పద్మశ్రీ అవార్డు నిలువబోతోంది.