Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అవార్డులు రావడం వాటిని గవర్నర్ చేతుల మీదగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇది కేవలం తన కష్టం మాత్రమే కాదని తనతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరి విజయమన్నారు. పెద్దల ఆశీర్వాదాలతోనే ఇంతటి ఘనత సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. ఇక పద్మశ్రీ పురస్కారం రావడంపై కీరవాణి తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘‘భారత ప్రభుత్వ పౌర పురస్కారం వరించిన సందర్భంగా నా తల్లిదండ్రులతో పాటు నా గురువులు కవితపు సీతమ్మ గారి నుంచి కుప్పాల బుల్లి స్వామి నాయుడు గారి వరకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.