Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హీరో శర్వానంద్ త్వరలో తన సింగిల్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్నారు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన ఈ వేడుకలో శర్వానంద్ ప్రాణ మిత్రుడు రామ్‌చణ్, ఆయన సతీమణి ఉపాసన పాల్గొన్నారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.