Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
2022 సంవత్సరానికిగాను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఐసీసీ (ICC) ప్రకటించింది. దీనిలో మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంపికగా మహిళల క్రికెట్లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ ఎంపికైంది. 2022 సంవత్సరానికి సంబంధించి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు కూడా వీరినే వరించాయి. 2021లోనూ బాబర్ అజామ్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. 2022లో మూడు ఫార్మాట్లలో కలిపి 44 మ్యాచ్‌లు ఆడిన బాబర్ అజామ్ 54.12 సగటుతో 2,598 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, 15 అర్ధ సెంచరీలున్నాయి.
ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన నాట్ స్కివర్ గతేడాది 17 మ్యాచ్‌ల్లో 833 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టి ఎంపికైంది. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఈమెనే వరించింది. ఇదే తరుణంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. జానీ బెయిర్ స్టో (ఇంగ్లాండ్), ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా), కగిసో రబాడ (దక్షిణాఫ్రికా)లను వెనక్కినెట్టి స్టోక్స్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. గతేడాది టెస్టుల్లో బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌ల్లో 36.25 సగటుతో 870 పరుగులు చేయడమే కాకుండా 26 వికెట్లు పడగొట్టాడు.